ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో ఇలా తెలియ జేస్తున్నారు: బంధువులతో బంధుత్వపు సంబంధాలను కొనసాగించడంలో మరియు వారితో దయ, కరుణా గుణాలతో వ్యవరించడంలో సంపూర్ణత కలిగిన వ్యక్తి అంటే, వారు తనకు చేసిన ఉపకారానికి బదులుగా అటువంటి ఉపకారమే చేసే వాడు కాదు. వాస్తవానికి బంధుత్వపు బంధాలను జోడించి ఉంచడంలో సంపూర్ణత కలిగిన వ్యక్తి అంటే, తనతో బంధుత్వాన్ని తెంచుకున్నా, తిరిగి దానిని జోడించేవాడు. వారు తనతో అమర్యాదగా, అవమానకరంగా ప్రవర్తించినా సరే, వారిని దయతో, వాత్సల్యములతో కలిసే వాడు.