ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ప్రజలలో ఉత్తమమైన తరం అంటే నేను (ప్రవక్తగా) మరియు నా సహాబాలు (సహచరులు) ఉన్న తరం. వారి తర్వాత తాబియీన్ (సహాబాలను కలిసిన, మరియు ప్రవక్తను కలవని విశ్వాసులు) వస్తారు. ఆ తర్వాత తబ్బఅ-తాబియీన్ (తాబియీన్ అనుచరులు) వస్తారు." ఈ హదీథును ఉల్లేఖించిన సహాబీ (రదియల్లాహు అన్హు) నాల్గవ తరం గురించి చెప్పడంలో సందేహించారు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "వారి తర్వాత (ఉత్తమ తరాల తర్వాత) కొంతమంది ప్రజలు వస్తారు – వారు ద్రోహం చేస్తారు, ప్రజలు వారిని నమ్మరు; వారు సాక్ష్యం చెబుతారు, కానీ వారి సాక్షి చెల్లదు; వారు ప్రతిజ్ఞ చేస్తారు, కానీ నెరవేర్చరు; వారు తినే, త్రాగే విషయాల్లో విస్తృతంగా ప్రవర్తిస్తారు (అధికంగా తింటారు, త్రాగుతారు), చివరికి వారి మధ్య మోటుదనం (అధిక బరువు) విస్తరిస్తుంది."