ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు ఇలా తెలియజేసారు: మరుసటి రోజు తాను జెండా ఎవరి చేతికైతే ఇస్తానో, ఆ వ్యక్తి చేతిలో, మదీనా సమీపంలోని ఖైబర్ అనే నగరపు యూదులపై ముస్లింలు విజయం సాధిస్తారు. ఇక్కడ జెండా అంటే, యుద్ధానికి బయలుదేరి వెళ్ళే సైన్యం, జెండాను తన నినాదంగా తీసుకుంటుంది. ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటంటే అతను అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతడిని ప్రేమిస్తారు. ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా పేర్కొన్నారు: తాను ఎప్పుడూ నాయకత్వం కావాలని ఇష్టపడలేదు - ఆ (ఖైబర్) దినమున తప్ప; అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని ప్రేమను పొందగలను అని ఆశపడ్డానని పేర్కొన్నారు. ఆ బృహత్కార్యం కొరకు తాను పిలువబడతాను అని, ఆ జెండాను తానే తీసుకోవాలి అనే ఆసక్తితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దృష్టిలో పడాలని తన ఛాతీని విశాలంగా చేసినాను అని పేర్కొన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ను పిలిచి ఆ జెండాను ఆయన చేతికి అందించి ఇలా ఆదేశించినారు “సైన్యంతో ముందుకు కదులు, యుద్ధభూమిలో శత్రువును ఎదుర్కొన్నపుడు, అల్లాహ్ నీకు ఈ కోటలపై విజయం మరియు ఆధిపత్యాన్ని ఇచ్చే వరకు యుద్ధభూమిని విడువకు - విశ్రాంతి కొరకో, లేక కొద్దిపాటి విడుపు ప్రకటించినప్పుడో, లేక యుద్ధవిరామం ప్రకటించినప్పుడో తప్ప .” అలీ (రదియల్లాహు అన్హు) జెండా తీసుకుని ముందుకు కదిలారు. కొద్ది దూరం వెళ్ళి ఆగినారు, అయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలకు అవిధేయత చూపినట్లవుతుందని, ఆయన వెనుక వైపుకు తిరగలేదు. ఆ విధంగానే నిలబడి ఆయన తన స్వరాన్ని పెంచి బిగ్గరగా “ఓ ప్రవక్తా(సల్లల్లాహు అలైహి వసల్లం)! ఆ ప్రజలతో నేను ఏ విషయంపై పోరాడాలి?” అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వారు ‘అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యము పలకనంతవరకు వారితో పోరాడు; వారు ఒకవేళ (నీ పిలుపుకు) ప్రతిస్పందించి ఇస్లాంలోనికి ప్రవేశించినట్లయితే వారి రక్తం మరియు సంపదలు మీ నుండి రక్షించబడతాయి మరియు అవి మీ కొరకు నిషేధించబడినవి అవుతాయి; అయితే ధర్మబద్ధంగా అలా చేయవలసిన అవసరం ఏర్పడితే తప్ప, అంటే వారు ఇస్లాం చట్టం తీర్పుల ప్రకారం (షరియత్ ప్రకారం) వారు చంపబడవలసిన నేరం లేదా అపరాధం చేస్తే తప్ప. వారి లెక్క అల్లాహ్ వద్ద ఉంటుంది.