మతర్ ఇబ్న్ ఉకామిస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా ‘ఫలానా భూమిపై (ఫలానా ప్రదేశములో) చనిపోతాడు” అని విధివ్రాతలో లిఖించి ఉంటే, అతడు అక్కడికి వెళ్ళడానికి ఏదైనా కారణాన్ని అతని కొరకు పొందుపరుస్తాడు”. ప్రామాణికమైన హదీథు - అత్తిర్మిదీ నమోదు చేసినారు:
explain-icon

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒకవేళ అల్లాహ్, తన దాసులలో ఎవరినైనా, భూమిపై ఫలానా ప్రదేశములో చనిపోతాడు, అని నిర్ణయించి ఉంటే, విధివ్రాతలో రాసి ఉంటే, ఆ దాసుడు అక్కడ నివసిస్తున్న వాడు కాకపోయినా, అతడు అక్కడి వెళ్ళే ఒక అవసరాన్ని (ఒక కారణాన్ని) ఏర్పరుస్తాడు. అప్పుడు అతని ఆత్మ అక్కడ (ఆ ప్రదేశములో) తీయబడుతుంది.

explain-icon

fawaed

  • ఈ హదీసు సర్వోన్నతుడూ, సర్వ శక్తి మంతుడూ అయిన అల్లాహ్ యొక్క వాక్కును - وَمَا تَدْرِى نَفْسٌۢ بِأَىِّ أَرْضٍۢ تَمُوتُ ۚ - (మరియు ఏ మానవుడూ తాను ఏ భూభాగంలో మరణిస్తాడో ఎరుగడు, సూరహ్ లుఖ్మాన్ 31:34) – ధృవపరుస్తున్నది.