ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: "ఇస్రాయేలు సంతతివారిని ప్రవక్తలు పాలించేవారు. వారు ప్రజల వ్యవహారాలను పాలకుల్లా నిర్వహించేవారు. ప్రతిసారి ప్రజల మధ్య అవినీతి (దుష్టత) ఏర్పడినప్పుడు, అల్లాహ్ వారి విషయాలను సరిదిద్దడానికి, ధార్మిక ఆదేశాలలో వారు చేసిన మార్పులు చేర్పులను తొలగించడానికి మరో ప్రవక్తను పంపేవాడు. నా తరువాత ఇక ప్రవక్తలు ఉండరు. నా తరువాత ఖలీఫాలు (పాలకులు) ఉంటారు, వారు ఒకరి కంటే ఎక్కువమంది అవుతారు. వారి మధ్య విభేదాలు, కలహాలు కలుగుతాయి. దానికి సహాబాలు ఇలా అడిగారు: "అపుడు ఏమి చేయమని మీరు మాకు ఆదేశిస్తున్నారు?" దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఒక ఖలీఫాకు బైఅత్ (ప్రతిజ్ఞ) చేసిన తరువాత, మరొక ఖలీఫాకు కూడా బైఅత్ చేయబడితే, మొదటి ఖలీఫాకు చేసిన బైఅత్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది; రెండవదాన్ని చేయడం అనుచితం, అతడు దాన్ని కోరడం కూడా నిషిద్ధం. పాలకులకు వారి హక్కులను ఇవ్వండి, వారికి విధేయులుగా ఉండండి, అల్లాహ్‌కు అవిధేయత కలిగించే విషయాలలో తప్ప, మిగతా విషయాల్లో వారిని అనుసరించండి. ఎందుకంటే, అల్లాహ్ వారికి అప్పగించిన బాధ్యత గురించి వారిని ప్రశ్నిస్తాడు, వారి చర్యలకు వారిని బాధ్యత వహింపజేస్తాడు."