మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మనకు మార్గనిర్దేశం చేసారు,ఆయన ఏదైనా విషయాన్ని నిషేధించినట్లయితే,ఎటువంటి మినహాయింపు లేకుండా దానికి దూరంగా ఉండాలి,మరియు ఏదైనా చేయమని మనకు ఆదేశిస్తే శక్తిమేరకు చేయగలిగినంతగా దాన్నిఆచరించాలి,పిదప మునుపటి జాతుల మాదిరిగా మనము మారకూడదని ఆయన హెచ్చరించారు,వారు వారి ప్రవక్తలను అధిక ప్రశ్నలు అడిగారు,వారితో విభేదించారు, కాబట్టి అల్లాహ్ వారిని విధ్వంసకరమైన మరియు వినాశనకరమైన వివిధ రకాల శిక్షలకు గురిచేశాడు,కాబట్టి వారు నడిచిన మార్గాల్లో అనుసరించకుండా ఉన్నట్లైతే వారిలా నాశనం కాకుండా మనము రక్షించుకోగలము.