ఒక గొప్ప సహాబీ – అబ్దుల్లాహ్ ఇబ్నె ఖుబైబ్ రజియల్లాహు అన్హు – బాగా వర్షం కురుస్తూ, చిమ్మ చీకటిగా ఉన్న ఒక రాత్రి తాము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, తమకు నమాజు చదివించమని కోరడాని బయలుదేరినామని, మరియు ఆయనను చూసినామని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో “ఇలా అను” అన్నారు, అంటే అక్కడ దాని అర్థం “పఠించు” అని. కానీ ఆయన ఏమీ పఠించకుండా అలాగే నిలబడ్డారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవే మాటలను తిరిగి అన్నారు. అపుడు అబ్దుల్లాహ్ ఇబ్న్ ఖుబైబ్ “ఏమి పఠించను, ఓ ప్రవక్తా!” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “సూరహ్ అల్ ఇఖ్లాస్ (ఖుల్ హువాల్లాహు అహద్), మరియు ముఅవ్విజతైన్’ (సూరహ్ అల్ ఫలఖ్ - “ఖుల్ అఊజు బిరబ్బీల్ ఫలఖ్”, మరియు సూరహ్ అన్నాస్ “ఖుల్ అఊజు బిరబ్బీన్నాస్”) వీటిని సాయంత్రపు సమయాన, మరియు ఉదయం మూడు సార్లు పఠించు. అవి నీకు అన్ని విధాలా కీడు నుండి, మరియు అన్ని రకాల ఆపదల నుండి రక్షణ కల్పిస్తాయి” అన్నారు.