ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రిబాకు అంటే వ్యాపారానికి సంబంధించిన ఆరు వస్తువుల సరైన అమ్మకం - కొనుగోలు పద్ధతిని వివరించారు (దీని వలన ఆ లావాదేవీలో వడ్డీ ప్రమేయం ఉండదు). అవి: బంగారం, వెండి, గోధుమ, బార్లీ, ఖర్జూరం, ఉప్పు. ఒకే రకమైన వస్తువులను కొనుక్కుంటున్నప్పుడు లేదా అమ్ముతున్నప్పుడు (ఉదా: బంగారాన్ని బంగారంతో, వెండిని వెండితో...) ఈ రెండు షరతులు తప్పకుండా పాటించాలి: మొదటిది: పరమాణంలో సమానత్వం: బంగారం మరియు వెండి వంటి బరువుతో కొలిచే వస్తువుల విషయంలో — బరువులో సమానత్వం ఉండాలి. గోధుమలు, బార్లీ, ఖర్జూరాలు, ఉప్పు వంటి కొలతతో కొలిచే వస్తువుల విషయంలో — కొలతలో సమానత్వం ఉండాలి. రెండవది: అమ్మేవాడు మరియు కొనేవాడు వస్తువు మార్పిడిని తక్షణమే చేయాలి, అంటే అమ్మకం - కొనుగోలు మాట జరుగుతున్న స్థలంలో తక్షణమే (కూర్చున్న చోటనే) వస్తు మార్పిడి జరగాలి. ఒకవేళ ఈ వ్యాపార వస్తువులు భిన్నంగా ఉంటే (ఉదాహరణకు బంగారాన్ని వెండికి లేదా ఖర్జూరాలను గోధుమకు అమ్మడం), ఆ అమ్మకం ఒక షరతుతో మాత్రమే అనుమతించబడుతుంది. వస్తు మార్పిడి ఒప్పంద సమయంలోనే తక్షణం జరగాలి. అలా తక్షణం చేయకపోతే, అది నిషేధించబడిన వడ్డీ వ్యాపారంగా పరిగణించబడుతుంది మరియు ఇద్దరూ (విక్రేత మరియు కొనుగోలుదారు) నిషేధించబడిన వడ్డీ (రిబా) పాపంలో పడిపోతారు.