ఇయాస్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ అబూ దుబాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “అల్లాహ్ యొక్క దాసురాళ్ళను కొట్టకండి”. తరువాత ఉమర్ రదియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నారు: “స్త్రీలు తమ భర్తల పట్ల ధైర్యంగా మారారు (భర్తలకు తిరగబడి జవాబిస్తున్నారు)”. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దండించడానికి అనుమతించినారు. కానీ తరువాత చాలామంది స్త్రీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబము వద్దకు వచ్చి తమ భర్తలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయసాగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా చాలామంది స్త్రీలు తమ భర్తలపై ఫిర్యాదు చేస్తూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలల్ం కుటుంబము వద్దకు వచ్చినారు. ఆ పురుషులు మీలో ఉత్తములు కారు.” ప్రామాణికమైన హదీథు - అబూదావుద్ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:
explain-icon

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం భార్యలను కొట్టడాన్ని నిషేధించారు. అప్పుడు అమీరుల్ ము’మినీన్ ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వచ్చి ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, స్త్రీలు తమ భర్తల పట్ల ధైర్యంగా మారారు (వారు భర్తలకు ఎదురు జవాబిస్తున్నారు) మరియు వారిలో మర్యాద, సభ్యత క్షీణించింది”. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ భర్తల బాధ్యతలను నెరవేర్చడానికి నిరాకరించడం, అతనికి అవిధేయత చూపడం వంటి కారణాలు ఉంటే వారిని కొట్టడానికి అనుమతి ఇచ్చారు, కానీ తీవ్రంగా కాదు. ఆ తరువాత చాలామంది స్త్రీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల వద్దకు వచ్చి తమ భర్తలు తమను విపరీతంగా కొడుతున్నారని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతిని దుర్వినియోగం చేస్తున్నారని, తమ భర్తలపై ఫిర్యాదు చేసారు. అది తెలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీలో ఆ పురుషులు, ఎవరైతే తమ భార్యలను తీవ్రంగా కొడుతున్నారో, వారు ఉత్తములు కారు.”

explain-icon

Benefits from the Hadith

  • ఈ హదీథులో స్త్రీలను దయగా చూసుకోవటం, మరియు వారి పట్ల సహనం కలిగి ఉండటం మరియు వారి ప్రవర్తనను ఉపేక్షించడం (చూసీ చూడనట్లు వదిలివేయడం) వారిని కొట్టడం కంటే మెరుగైనదని వివరించ బడుతున్నది.
  • భార్యలలో తిరగబడే ధోరణికి చివరి చికిత్సగా దండించడాన్ని (కొట్టడాన్ని) సూచించినాడు అల్లాహ్. దివ్య ఖుర్’ఆన్’లో అల్లాహ్ ఇలా అంటున్నాడు: […కానీ అవిధేయత చూపుతారని మీకు భయముంటే, వారికి (మొదట) నచ్చజెప్పండి, (తరువాత) పడకలో వేరుగా ఉంచండి, (ఆ తరువాత కూడా వారు విధేయులు కాకపోతే) వారిని (మెల్లగా) కొట్టండి. కాని వారు మీకు విధేయులై ఉంటే! వారిని నిందించటానికి మార్గం వెతకకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ మహోన్నతుడు, మహనీయుడు.] (సూరహ్ అన్’నిసా 4:34). ఆయతులో పేర్కొనబడిన ఈ మూడు విధానాలు అదే క్రమంలో ఆచరించబడతాయి, ఒకే సమయంలో వాటిని ఆచరణలో పెట్టరాదు. ముందుగా సలహాలు, ఉపదేశం, హెచ్చరికలు మొదలైన వాటితో ప్రారంభించాలి. అవి ప్రయోజనకరంగా రుజువైతే అల్’హందులిల్లాహ్. అవి పనిచేయకపోతే రెండవ స్థాయి చర్యగా ఆమె పడకను వేరు చేయాలి; అది కూడా సఫలీకృతం కాకపోతే అపుడు చివరగా క్రమశిక్షణా చర్యగా ఆమెను దండించాలి – ప్రతీకార చర్యగా కాదు.
  • ఒక వ్యక్తి తన ఇంటికి మరియు తన కుటుంబానికి సంరక్షకుడు. అతడు తన కుటుంబాన్ని ఙ్ఞానం మరియు మంచి ఉపదేశాలు, ఉద్బోధలతో పెంచడానికి మరియు క్రమశిక్షణ గరపడానికి బాధ్యత వహిస్తాడు.
  • ఒక పండితుడు గనుక ఫత్వా ఇచ్చినట్లయితే, ఆ ఫత్వా యొక్క పరిణామాలు మరియు ఫలితాలను చర్చించడానికి, అర్థం చేసుకోవడానికి అతడిని సంప్రదించవచ్చును. దానికి అనుమతి ఉన్నది.
  • ఫిర్యాదుదారుడు తనకు హాని కలిగిస్తున్న విషయాన్ని గురించి పాలకుడికి లేదా పండితుడికి ఫిర్యాదు చేయడానికి అనుమతి ఉంది.
explain-icon

ఇంకా