జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు నాకు ఈ విషయం తెలియజేసినారు: “ఒక వ్యక్తి ఉదూ చేసి, ఒక గోరు పరిమాణంలో ఉన్న ఒక చిన్న భాగాన్ని తన పాదంలో కడగకుండా వదిలివేసాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని చూసి ఇలా అన్నారు: “వెళ్ళు, వెళ్ళి నీ ఉదూను సక్రమంగా ఆచరించు". అతడు మళ్ళీ ఉదూ చేసి సలాహ్ ఆచరించినాడు.” సాక్ష్యాల ఆధారంగా ప్రామాణికమైనది - ముస్లిం నమోదు చేసినారు:
explain-icon

వివరణ

ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడే వుజూ ముగించి వచ్చిన ఒక వ్యక్తి ని చూసారు. అతడు తన పాదం పై ఒక గోరు అంత పరిమాణం గల భాగాన్ని కడగకుండా వదిలేసాడు. ఆ భాగానికి వుజూ నీరు చేరలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అతని నిర్లక్ష్యం కారణంగా (నీరు చేరకుండా) ఉండిపోయిన భాగం వైపునకు చూపుతూ అతనితో ఇలా అన్నారు: “వెళ్ళు, వెళ్ళి నీ ఉదూను ఉత్తమంగా ఆచరించి పూర్తి చేయి, ప్రతి భాగానికి దానికి చేరవలసిన నీరు చేరేలా చేయి.” కనుక అతడు తిరిగి వెళ్ళి, (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టుగా) వుజూ పూర్తి చేసి, అప్పుడు నమాజు ఆచరించాడు.

explain-icon

fawaed

  • ఙ్ఞానం లేని వారికి, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి మంచి పనుల వైపునకు సరైన మార్గదర్శకం చేయడానికి చొరవ తీసుకోవడం తప్పనిసరి; ముఖ్యంగా అతని అజ్ఞానము, నిర్లక్ష్యము కారణంగా కలిగే చెడు అతని ‘ఇబాదత్’ను (ఆరాధనను) లోపభూయిష్టం గావించునది అయితే, అది మరింత తప్పనిసరి అవుతుంది.
  • వుజూలో నిర్దిష్ట శరీర భాగాలను నీటితో పూర్తిగా కడగడం వాజిబ్ (తప్పనిసరి), మరియు ఎవరైనా ఏదైనా భాగాన్ని వదిలివేస్తే – అది చిన్నది అయినా కూడా - అతని వుజూ సరికాదు, చెల్లదు. వుజూ ముగించిన తరువాత ఎక్కువ సమయం గడిచినట్లయితే, అతను వుజూను పునరావృతం చేయాలి.
  • వుజూ సక్రమంగా ఆచరించాలి అనడం షరియత్ లోని భాగమే. వుజూను షరియత్ ప్రకారం సరియైన పధ్ధతిలో, సంపూర్ణంగా నిర్వహించాలి.
  • పాదాలు కడుగుట వుజూలో భాగమే. పాదాలపై తుడిచినట్లుగా చేతిని పారాడించడం సరిపోదు. పాదాలను నీటితో శుభ్రంగా కడగాలి.
  • వుజూలో కడగవలసిన శరీర భాగాలను (షరియత్ లో) వివరించిన క్రమములోనే కడగాలి. ఒక భాగం ఎండి పోకముందే కడుగ వలసిన తరువాతి భాగాన్ని కడగాలి.
  • అజ్ఞానం మరియు మతిమరుపు విధి చేయబడిన దానిని తొలిగించదు, బదులుగా విధి చేయబడిన ఆచరణ పాపాన్ని తొలగిస్తుంది. ఈ హదీసులో ఆ వ్యక్తి తెలియనితనం వల్ల వుజూ సక్రమంగా నిర్వహించ లేదు; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్ విధిగా చేసిన ఆచరణను అతనికి వదిలి వేయలేదు, అదే వుజూ. మళ్ళీ వుజూ చేసి రమ్మని ఆదేశించినారు.
explain-icon

ఇంకా