ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రాత్రి నిద్రపోయి, ఫజ్ర్ నమాజు కొరకు లేవకుండా, సూర్యుడు ఉదయించి పట్టపగలు అయ్యే దాకా నిద్రలేవని ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించడం జరిగింది. ఆయన (స) ఇలా అన్నారు: అతడు ఎటువంటి వాడంటే అతని చెవిలో షైతాను మూత్రము పోసినవాడు.