ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలతో మక్కా నుండి మదీనాకు ప్రయాణించినారు. దారిలో వారు నీళ్ళున్న ప్రదేశాన్ని కనుగొన్నారు. దానితో సహాబాలలో కొంతమంది గబగబా వెళ్ళి అస్ర్ నమాజు కొరకు ఉదూ చేసుకున్నారు. అయితే వారి పాదాల వెనుక భాగము (మడమలు) నీరు చేరని కారణంగా పొడిగా కనిపించింది. దానితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వుదూ చేసేటప్పుడు పాదాల వెనుక భాగాన్ని సరిగా కడుక్కోకుండా నిర్లక్ష్యం చేసిన వారికి అగ్నిలో శిక్ష మరియు వినాశనం ఉన్నాయి”. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షుణ్ణంగా ఉదూ పూర్తి చేయమని వారిని ఆదేశించినారు.