ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హితబోధ చేస్తున్నారు: ఎవరైతే నిద్రలేస్తారో వారు ముక్కును నీటితో మూడుసార్లు శుభ్రపరుచుకోవాలి. ముక్కును నీటితో శుభ్రపరుచుకోవడం అంటే, ముక్కులోనికి నీరు ఎక్కించి తరువాత ఆ నీటిని చీది వేయడం. ఎందుకంటే షైతాను అతని ముక్కు పుటాల మీద రాత్రి గడుపుతాడు కనుక; అంటే పూర్తి ముక్కుపై.