ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – విశ్వాసములో సంపూర్ణత కలిగిన విశ్వాసి ఎవరంటే, ఉత్తమ వ్యక్తిత్వము, శీల సంపద కలిగిన వాడు, చిరునవ్వుతో ప్రకాశవంతమైన ముఖము కలిగినవాడు, సత్కార్యములు చేయువాడు, అందరితో మంచిగా సంభాషణ చేయువాడు, కీడు మరియు చెడులనుండి దూరంగా ఉండేవాడు – అని తెలియ జేస్తున్నారు. అలాగే విశ్వాసులలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తన స్త్రీలతో ఉత్తమంగా ఉంటాడో అన్నారు, అంటే ఉదాహరణకు తన భార్యలతో, కూతుళ్ళతో, తన అక్కలు, చెల్లెళ్ళతో మరియు తన బంధువులలోని స్త్రీలతో. ఎందుకంటే వీరంతా – ఉత్తమంగా వ్యవహరించడానికి మిగతా వారి కంటే ముందు అర్హులు.