అబూ ముహమ్మద్ అల్-హసన్ ఇబ్నె అలీ ఇబ్నె అబూ తాలిబ్ - రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మనుమడు మరియు ఆయనకు ఇష్టమైనవాడు - నుండి ఉల్లేఖన: నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇది కంఠస్థం చేసుకున్నాను: "ఏది నీకు సందేహాన్ని కలిగిస్తుందో, దానిని వదిలిపెట్టి, ఏది నీకు సందేహాన్ని కలిగించదో, దానిని ఆచరించు." ప్రామాణికమైన హదీథు - అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:
explain-icon

వివరణ

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: మాటలలో లేదా పనులలో, ఏది నిషిద్ధమైనదా కాదా, హరామా (నిషేధించబడినదా) లేదా హలాలా (ధర్మసమ్మతమైనదా) అని నీకు సందేహం కలిగించే వాటిని విడిచిపెట్టి, ఏది ఉత్తమమైనదని మరియు ధర్మసమ్మతమైనదని నీవు నిశ్చయించుకున్నావో, దానిని ఆచరించు.

explain-icon

fawaed

  • ఒక ముస్లిం తన వ్యవహారాలను నిశ్చితత్వం, స్థిరత్వం పైనే స్థాపించాలి మరియు సందేహాస్పదంగా ఉన్న దాన్ని వదిలి వేయాలి మరియు అతడు తన ధర్మాన్ని గురించి అంతర్ దృష్టి మరియు మంచి అవగాహన కలిగి ఉండాలి.
  • సందేహాస్పదమైన మరియు అనుమానాలు రేకెత్తించే వ్యవహారాలలో పడరాదని నివారించబడింది.
  • మీరు ప్రశాంతత మరియు సౌకర్యాన్ని కోరుకుంటే, సందేహాస్పదమైన వాటిని వదిలి వేయండి మరియు వాటిని ప్రక్కన పెట్టండి.
  • అల్లాహ్ తన దాసులపై కరుణ, దయ కలిగి ఉంటాడు, ఆత్మకు మరియు మనస్సుకు శాంతిని కలిగించే వాటిని చేయమని ఆజ్ఞాపించాడు; ఆందోళన, అశాంతి మరియు గందరగోళాన్ని కలిగించే వాటిని వదిలి వేయాలని నిషేధించాడు.
explain-icon

కూర్పులు

explain-icon

ఇంకా