సందేహాలకు, అనుమాలకు దారి తీసే ఏవైనా మాటలు కానీ, చేతలు కానీ ఉంటే, వాటిని వదిలి వేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించినారు; అవి నిషేధించబడిన విషయాలు అయినా, కాకపోయినా సరే, అవి అనుమతించబడిన విషయాలు అయినా లేదా నిషేధించబడిన విషయాలు అయినా సరే – వాటికి బదులుగా కేవలం వాటినే ఎంచుకొండి వేటిలోనైతే సందేహాలకు, అనుమాలకు తావు లేదో; వేటి గురించైతే అవి మంచివి అనీ, పరిశుద్ధమైనవి అనీ, చట్టసమ్మతమైనవి అనీ (షరియత్ ఆమోదించినవని) మీకు ఖచ్చితంగా తెలుసునో వాటిని మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే వాటిలో హృదయం శాంతి మరియు ప్రశాంతతను పొందుతుంది, కానీ సందేహాన్ని కలిగించే, అనుమానాలు రేకెత్తించే విషయాలు హృదయాన్ని ఆందోళనకు మరియు కలతకు గురి చేస్తాయి.