చనిపోయిన తరువాత విశ్వాసి సమాధిలో ప్రశ్నించబడతాడు; అతడిని ఇద్దరు దైవదూతలు ప్రశ్నిస్తారు. చాలా హదీసులలో పేర్కొనబడిన విధంగా వారి పేర్లు ‘మున్కర్’ మరియు ‘నకీర్’. అపుడు విశ్వాసి “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదర్రసూలల్లహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు) అని సాక్ష్యమిస్తాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఇది అల్లాహ్ (ఖుర్’ఆన్ లో) చేసిన దృఢమైన ప్రకటన: “యుసబ్బితు ల్లాహుల్లజీన ఆమనూ బిల్’ఖౌలిస్సాబితి ఫిల్ హయాతిద్దున్యా వఫిల్ ఆఖిరతి” (సూరహ్ ఇబ్రాహీం 14:27) [“మహోన్నతుడైన అల్లాహ్ ఈ వాక్యం ద్వారా విశ్వసించిన వారిని ఇహలోకంలో మరియు పరలోకంలో దృఢంగా ఉంచుతాడు.”]