అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊ ద్ (రదియల్లాహు అన్హు) ఇలా పేర్కొంటున్నారు - ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొన్ని రెల్లుగడ్డి పుల్లలతొ నేసిన చిన్న చాపపై పడుకున్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దానిపై నుండి లేచినపుడు ఆ చాప పుల్లల గుర్తులు వారి ప్రక్కలపై వదిలివేయబడి ఉండడాన్ని చూసి మేము ఇలా అన్నాము: “ఓ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మేము మీ కొరకు ఒక మెత్తని పరుపును తయారు చేసి తీసుకు వస్తాము. అది ఈ రెల్లు గడ్డి చాప కన్నా మీరు పడుకోవడానికి మంచిగా ఉంటుంది. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: దాని వైపునకు ఆకర్షితుడనై అది కావాలి అనుకునేటంత ప్రేమ, అభిమానము నాకు ఈ ప్రపంచం పట్ల లేవు. ఈ ప్రపంచంలో నా స్థితి మరియు దానిలో నా మనుగడ అనేది ఒక చెట్టు కింద ఆశ్రయం పొంది, ఆ తరువాత దానిని వదిలి వెళ్లిపోయే రౌతు లాంటిది.