ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేస్తున్నారు: సూరతుల్ ఫాతిహా పఠించబడని సలాహ్ (నమాజు) సరియైనది కాదు; ఎందుకంటే ప్రతి రకాతులో సూరతుల్ ఫాతిహా పఠించుట సలాహ్ యొక్క అర్కాన్’లలో ఒక రుక్న్ (మూలస్థంభాలలో ఒక మూలస్థంభము).
fawaed
సూరతుల్ ఫాతిహా పఠించగలిగి ఉండీ, దానిని పఠించకుండా ఇంకా ఏ సూరహ్ పఠించినా అది సరిపోదు, ఆమోదయోగ్యం కాదు.
ఏ రకాతులో నైనా, ఉద్దేశ్యపూర్వకంగా లేక అజ్ఞానం కొద్దీ, లేక మరిచిపోయి అయినా సూరతుల్ ఫాతిహా పఠించనట్లయితే ఆ రకాతు సంపూర్ణము కాదు (లోపభూయిష్టమైనది). ఎందుకంటే అది ఒక రుక్న్ (మూలస్థంభము); మూలస్థంభాలు ఎన్నడూ పాటించకుండా వదిలివేయబడవు.
అయితే ఇమాం రుకూ స్థితిలో ఉండగా సలాహ్’లో చేరిన వ్యక్తికి సూరతుల్ ఫాతిహ పఠించే నియమం వర్తించదు.