ఈ హదీసులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపరుస్తున్నారు : కష్టాలు వచ్చి మీద పడడం, వాటి ద్వారా అల్లాహ్ విశ్వాసులైన స్త్రీలను, పురుషులను పరీక్షించడం – ఈ రెండూ ఒకదాని నుండి మరొకటి విడదీయలేని విషయాలు. వాటి ద్వారా అల్లాహ్ స్వయంగా వారిని పరీక్షిస్తాడు – ఉదాహరణకు: స్త్రీలను, పురుషులను వారి ఆరోగ్యం విషయంలో, వారి శరీరం విషయంలో రుగ్మతలకు గురి చేసి; అలాగే సంతానం విషయంలో పరీక్షిస్తాడు, ఉదాహరణకు: సంతానాన్ని వ్యాధిగ్రస్తులను చేసి, వారిని మరణింపజేసి, లేదా వారిని తల్లిదండ్రుల పట్ల అవిధేయులుగా చేసి, లేదా ఇంకా వేరే విధానాలలో; అలాగే వారి సంపదల విషయంలోనూ పరీక్షిస్తాడు, ఉదాహరణకు: పేదరికానికి గురి చేసి, లేదా వ్యాపారంలో నష్టాలకు గురి చేసి, లేదా పేద జీవన పరిస్థితులలో మరియు జీవనోపాధిలో ఇబ్బందులకు గురి చేసి పరీక్షిస్తాడు; ఇలా అల్లాహ్ ఆ పరీక్షల ద్వారా వారి పాపాలు మరియు అతిక్రమణలు అన్నింటినీ పరిహరించే వరకు చేస్తాడు; ఆ విధంగా అతను అల్లాహ్‌ను కలిసినప్పుడు, అతను చేసిన పాపాలన్నింటి నుండీ మరియు అతిక్రమణలన్నింటి నుండీ శుద్ధి చేయబడిన స్థితిలో వారు అల్లాహ్ ను కలుసుకుంటారు.