ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లమ్ ఏదైనా ఒక జాతివారిని అనుకరించే వారి గురించి వివరిస్తున్నారు. ఉదాహరణకు అవిశ్వాసుల సమూహాన్ని లేదా క్రైస్తవుల సమూహాన్ని (జాతిని) అనుకరించేవారు లేదా ధార్మికులైన ప్రజల సమూహాన్ని అనుకరించేవారు - ఇలా ఏదైనా ఒక జాతిని, సమూహాన్ని వారి లక్షణాలలో, వారి స్వభావం లో, వారి గుణాణాలలో లేక వారి విశ్వాసాలలో, వారి ఆరాధనా పధ్ధతులలో లేక వారి ఆచార వ్యవహారాలలో వారిని అనుకరించినట్లయితే - అలా అనుకరించిన వారు, అనుకరించబడిన జాతి లేక సమూహములోని వారు అవుతారు. ఎందుకంటే వారిని బాహ్యంగా అనుకరించడం, అంతరంగంలో కూడా వారిని అనుకరించడానికి దారితీస్తుంది. ఎవరినైనా ఏదైనా విషయం లో అనుకరించడం అనేది ఆ విషయం పట్ల మనలోని ప్రశంసాత్మక వైఖరి, హర్షాతిరేకము మొదలైన వాటి కారణంగా మొదలవుతుంది. అది ఆ విషయాలను ప్రేమించేందుకు, వాటి పట్ల భక్తి శ్రద్ధలకు, వాటిపై ఆధారపడుటకు దారి తీయవచ్చు. ఇంకా అది మన అంతరంగంలో కూడా వారిని అనుకరించడానికి, ఆరాధించడానికి దారి తీయవచ్చు. అల్లాహ్ క్షమించుగాక.