చిన్న చిన్న పాపాలు చేయడంలో మెతకదనం చూపవద్దని, వాటిని తరచుగా చేయవద్దని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. ఎందుకంటే అవన్నీ నాశనానికి దారితీస్తాయి. ఒక లోయలో విడిది చేసిన వ్యక్తుల ఉదాహరణను ఆయన ఇచ్చారు. అక్కడి ప్రతి ఒక్కరూ ఒక చిన్న కట్టెను తీసుకు వచ్చారు, అలా వారు ఆ కట్టెలను తమ రొట్టెలు కాల్చేందుకు అవసరమైనంతగా జమ చేసి పెద్ద మంట రాజేసినారు. అలాగే చిన్న చిన్న పాపాలు చేసిన వ్యక్తి వాటిలో చిక్కుకోకుండా, వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాప పడకపోతే, అల్లాహ్ అతడిని క్షమించకపోతే, అవన్నీ అతడిని నాశనం చేస్తాయి.