ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్వభావం గురించి ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా చెప్పినారు, "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వభావంలో అసభ్యత, అశ్లీలత ఉండేది కాదు. ఆయన మాటల్లో, పనుల్లో అసభ్యత, దుర్వినియోగం, ఆడంబరత ఉండేది కాదు. ఆయన ఎన్నడూ అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించేవారు కాదు. అంతే కాదు, సంతల్లో (బజార్లలో) బిగ్గరగా, గొడవగా అరిచేవారు కాదు. తనకు చెడు చేసినవారికి చెడుతో ప్రతిస్పందించేవారు కాదు; కాని మంచితోనే ప్రతిస్పందించేవారు. తన హృదయంలోనూ క్షమించేవారు, బయట కూడా మన్నించేవారు, అలాంటి (చెడు చేసిన) వారిని పట్టించు కోకుండా దూరంగా ఉండేవారు."