విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా నివేదించినారు: ఒక స్త్రీ తన ఇద్దరు కుమార్తెలతో తన వద్దకు వచ్చి తినడానికి ఏదైనా దానం చేయమని అడిగింది. ఆయిషా రదియల్లాహు అన్హా దగ్గర ఒక్క ఖర్జూరం తప్ప మరేమీ లేదు, ఆమె ఆ ఒక్క ఖర్జూరాన్ని కూడా ఆమెకు ఇచ్చివేసినారు. ఆ స్త్రీ తన ఇద్దరు కుమార్తెలకు ఖర్జూరాన్ని పంచిపెట్టింది, ఆమె దాని నుండి ఏమీ తినలేదు. తరువాత ఆమె లేచి వెళ్ళిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోపలికి ప్రవేశించారు మరియు ఆయిషా రదియల్లాహు అన్హా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు జరిగింది వివరించారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వస్లలం ఇలా అన్నారు: తమ కుమార్తెల పట్ల బాధ్యత వహించి, వారిని జాగ్రత్తగా చూసుకుని, వారి పట్ల మంచిగా ప్రవర్తించేవాడు - వారికి విద్య నేర్పడం, తినిపించడం, తాగించడం, దుస్తులు ధరించడం మరియు ఇవన్నీ ఓపికగా భరించేవారు – అటువంటి వారికి ఆ పిల్లలు నరకాగ్ని నుండి రక్షణ కవచంగా మరియు నరకాగ్ని వారిని తాకకుండా ఒక అడ్డుతెరగా ఉంటారు.