కొంతమంది సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో: “ఓ ప్రవక్తా! సల్లల్లాహు అలైహి వసల్లం. మేము తింటున్నాము కానీ ఎప్పుడూ కడుపు నిండినట్లు అనిపించటం లేదు” అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో ఇలా అన్నారు: “బహుశా మీరు విడివిడిగా తింటున్నారేమో, ఎవరికి వారు ఒంటరిగా తింటున్నారేమో.” దానికి వారు: “అవును” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “విడివిడిగా, ఒంటరిగా కాకుండా, మీరంతా సమిష్ఠిగా ఒకచోట చేరి భోజనం చేయండి. ఆహారంపై “బిస్మిల్లాహ్” (అల్లాహ్ నామమున ప్రారంభిస్తున్నాము) అని అల్లాహ్ పేరును స్మరించండి. ఆ ఆహారం మీ కొరకు దీవించబడి, శుభప్రదం అవుతుంది, మరియు దానితో మీరు సంతుష్ఠులౌతారు” అన్నారు.