ఈ హదీథులో హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: వారు (సహాబాలు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఎపుడు భోజనం చేసినా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం భోజనం వైపునకు తన చేయి చాచనంత వరకు వారిలో ఎవరూ భోజనంలో చేయి పెట్టేవారు కాదు. ఆయన ఇంకా ఇలా అంటున్నారు: “ఒకసారి మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో భోజనం చేయడానికి కూర్చున్నాము. ఇంతలో ఒక చిన్న బాలిక, ఎవరో తనను ముందుకు నెడుతున్నట్టుగా పరుగెత్తుకుంటు వచ్చి ఆ భోజనములో చేయి పెట్టబోయింది. అయితే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఆమె చేయి పట్టుకున్నారు. తరువాత ఒక ఎడారివాసి కూడా ఎవరో ముందుకు నెడుతున్నట్టుగా పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతడు ఆ భోజనంలో చేయి పెట్టకముందే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని చేతిని కూడా పట్టుకున్నారు. తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ పేరు ఉచ్ఛరించబడని ఏ ఆహారాన్ని అయినా షైతాను తినగలడు. షైతాను ఈ బానిస అమ్మాయిని తీసుకువచ్చాడు, తద్వారా ఆహారాన్ని తాను తినడానికి అనువుగా చేసుకునేందుకు గాను. కానీ నేను ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాను. అప్పుడు ఈ ఎడారివాసిని తీసుకువచ్చాడు తద్వారా ఆహారాన్ని తాను తినడానికి అనువుగా చేసుకునేందుకు గాను. కానీ అతని చేతిని కూడా నేను పట్టుకున్నాను. ఎవరి చేతిలోనైతే నా ఆత్మ ఉన్నదో ఆయన సాక్షిగా ఆమె చేతితో పాటు షైతాను చేయి కూడా నా చేతిలో ఉన్నది.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు ఉచ్ఛరించి భోజనాన్ని తిన్నారు.