ఈ హదీథులో విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఒక సంఘటనను ఇలా ప్రస్తావిస్తున్నారు: ఇద్దరు కూతుళ్ళు ఉన్న ఒక పేద మహిళ ఆమె వద్దకు వచ్చి మూడు ఖర్జూరాలు అడిగింది. ఆమె తన ఇద్దరు కూతుళ్ళకు ఒక్కొక్క ఖర్జూరాన్ని ఇచ్చింది మరియు మిగిలిన ఒక ఖర్జూరం తినేందుకు తన చేతిని తన నోటి దగ్గరికి ఎత్తింది. ఆమె తినాలనుకున్న ఆ ఖర్జూరాన్ని ఆమె ఇద్దరు కూతుళ్ళు తమకు కావాలి అని అడిగారు, అపుడు ఆమె ఆ ఖర్జూరాన్ని రెండు భాగాలు చేసి ఆ ఇద్దరికీ పంచి పెట్టింది. ఆయిషా రదియల్లాహు అన్హా ఆమె పరిస్థితి చూసి ముగ్ధురాలైంది, మరియు ఆ మహిళ చేసిన పనిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పింది, అది విని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ ఆ ఖర్జూరం కారణంగా ఆమెకు స్వర్గాన్ని వాజిబ్ చేసినాడు (తప్పనిసరి చేసినాడు); లేక ఆ ఖర్జూరము కారణంగా ఆమెను నరకాగ్ని నుండి రక్షించినాడు.”