ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: కలలో మనసును ఆహ్లాదపరిచే దృశ్యం చూడడం అనేది అల్లాహ్ వైపునుండి అయి ఉంటుంది. అలాగే ఏ మాత్రమూ ఇష్టపడని, కలవరపరిచే, విచారానికి గురిచేసే దృశ్యాలు కలలో కనపడడం అది షైతాను వైపు నుంచి అయి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కలలో తనకు అసహ్యంగా అనిపించే, తాను ఇష్టపడని దృశ్యాన్ని చూసినట్లయితే అతడు తన ఎడమ వైపునకు ఉమ్మివేయాలి. దాని కీడునుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరుకోవాలి. అపుడు అది అతనికి ఎలాంటి హానీ కలిగించదు. ఎందుకంటే అల్లాహ్ ఇందులో పేర్కొనబడిన విషయాన్ని, అటువంటి చెడు కలలో చూసిన తాను ఇష్టపడని విషయము యొక్క కీడు నుండి అల్లాహ్ యొక్క రక్షణ మరియు ఆయన శరణు వేడుకోవడానికి దానిని ఒక కారణంగా చేసినాడు.