ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడైనా తుమ్మినపుడు: మొదట: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నోటికి చేతిని లేదా ఏదైనా వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకునేవారు – తుమ్ము కారణంగా తన నోటి నుండి లేదా ముక్కు నుండి ఏమైనా బయటకు చింది అక్కడ కూర్చున్న వారికి ఇబ్బంది కలిగించకుండా. రెండు: ఆయన తన గొంతు నుండి ఎక్కువగా శబ్దం బయటకు రాకుండా (సాధ్యమైనంత) తక్కువ చేసేవారు.