ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులను అన్ని రకాల పట్టు వస్త్రాలను ధరించుటనుండి నిషేధించినారు. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులను, స్త్రీలను బంగారము లేక వెండి పళ్ళాలలో, పాత్రలలో తినుట మరియు త్రాగుట నుండి నిషేధించినారు. అవి (బంగారు మరియు వెండి పాత్రలు మొదలైనవి) పునరుత్థాన దినమున కేవలం విశ్వాసులకు మాత్రమే ప్రత్యేకించబడతాయి, ఎందుకంటే ఈ ఇహలోక జీవితములో అల్లాహ్ యొక్క విధేయతలో వారు వాటికి దూరంగా ఉన్నారు కనుక. అలాగే పరలోక జీవితం లో అవిశ్వాసులకు ఇవేవీ లభించవు, ఎందుకంటే వారు తమ ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ ఆదేశానికి అవిధేయత చూపి, వేగిరపడి మంచిమంచి విషయాలను, విలాసాలను, సొంతం చేసుకుంటూ అనుభవించారు కనుక.