ఉక్ల్ మరియు ఉరైనా తెగల నుండి కొంత మంది పురుషులు ముస్లింలుగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చారు, కానీ వారి కడుపు ఉబ్బేలా చేసే వ్యాధి వారిని పట్టుకుంది. మదీనాలో ఆహారం మరియు గాలి వారికి సరిపోకపోవడంతో వారు అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని జకాత్ కొరకు ఒంటెలను ఉంచిన చోటికి వెళ్లి వాటి మూత్రం మరియు పాలు తాగమని ఆదేశించారు. వారు బయలుదేరారు. అక్కడికి చేరుకుని వారు కోలుకున్నారు, లావుగా, ఆరోగ్యవంతంగా తయారై, తిరిగి తమ శరీరపు ఛాయను సంతరించుకున్నారు. అప్పుడు వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పశువుల కాపరిని చంపి ఒంటెలను దోచుకుని వెళ్ళినారు. ఆ సంఘటన గురించిన వార్త తెల్లవారుజామున తెలిసింది. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని వెంబడించి, పట్టుకుని రావడానికి ప్రజలను పంపినారు. వారు పట్టుబడ్డారు. తెల్లవారుజామున, వారిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు బందీలుగా తీసుకువచ్చారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి చేతులు మరియు పాదాలను నరకమని ఆదేశించారు; పశువుల కాపరికి అలా చేసినందున వారి కళ్ళను పెరికి వేయమని, అగ్నిపర్వతపు ప్రాంతముగా పేరుగాంచిన అల్-హర్రా అనే ప్రాంతములో వారిని పడవేయమని ఆదేశించినారు. అక్కడ వారు నీటి కొరకు వేడుకున్నారు. కానీ వారు చనిపోయే వరకు వారికి నీరు అందలేదు. అబూ ఖిలాబహ్ ఇలా అన్నారు: వారు దొంగతనానికి పాల్బడినారు; హత్యకు పాల్బడినారు, విశ్వాసము స్వీకరించి తిరిగి అవిశ్వాసులుగా మారినారు; మరియు అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికి వ్యతిరేకంగా యుధ్ధం చేసినారు.