ఇక్రమ ఉల్లేఖన: అలీ రదియల్లాహు అన్హు కొంతమందిని కాల్చేశారు. అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమాకు ఈ విషయం తెలిసినప్పుడు ఇలా తెలిపారు: 'ఒకవేళ నేను ఉంటే అలా కాల్చేసేవాడిని కాదు’ ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: మీరు అల్లాహ్ పెట్టె శిక్షతో ప్రజలను శిక్షించకండి నేను కేవలం వారిని హతమార్చేవాడిని ’ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా తెలిపారు: ఎవరైతే తన సత్యధర్మాన్ని విడిచి పెడతాడో అతడిని మరణశిక్ష విధించండి.’ ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ నమోదు చేసినారు:
explain-icon

వివరణ

అలీ బిన్ అబూతాలిబ్ రదియల్లాహు అన్హు తన ధార్మిక విచక్షణతో, ఇస్లాం నుండి ధర్మభ్రష్టులైన కొంతమంది పాషండులను అగ్నితో కాల్చేశారు. ఈ విషయం అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమాకు చేరగా, ఆయన వారిని హతమార్చిన చర్యను సమర్థించారు; అయితే వారిని అగ్నితో కాల్చడాన్ని వ్యతిరేకించారు. ఆయన ఇలా అన్నారు: ఒకవేళ నేను అతని స్థానంలో ఉంటే వారిని అగ్నితో కాల్చేవాడిని కాదు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేశారు - అగ్నితో శిక్షించడం అగ్నికి ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తుంది. అయితే, వారిని కేవలం హతమార్చడమే సరిపోతుంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ‘ఎవరైతే ఇస్లాం నుండి ధర్మభ్రష్టుడై తన ధర్మాన్ని వేరొక ధర్మానికి మార్చుకుంటాడో, అతడికి మీరు మరణశిక్ష విధించండి’.

explain-icon

fawaed

  • ధర్మపండితుల ఏకాభిప్రాయం ప్రకారం ఇస్లాం విడిచి పెట్టిన ధర్మభష్టుడికి మరణశిక్ష విధించడం తప్పనిసరి, అయితే ఇది దాని షరతులకు లోబడి ఉంటుంది. మరియు దీనిపై కేవలం ఇమామ్ మరియు పాలకుడు మాత్రమే అమలు చేస్తారు.
  • ఆయన ప్రవచనం: "తన ధర్మాన్ని విడిచి, మార్గభ్రష్టుడైన వాడికి మరణశిక్ష విధించండి." అనగా: ఇస్లాం నుండి బయటకు వెళ్ళిపోయిన వారు, ఇది పురుషులకు మరియు స్త్రీలకు ఇద్దరికీ వర్తించే ఒక సాధారణ ఆదేశం.
  • మతభ్రష్టుడిని (ముర్తద్) అతని మతభ్రష్టత్వంపై వదిలివేయరు. బదులుగా అతడిని ఇస్లాం వైపునకు ఆహ్వానించాలి. ఒకవేళ అతను అంగీకరించకపోతే, పరిపాలకుడు అతడికి మరణశిక్ష విధించాలి.
  • ఈ హదీథులో అగ్నిశిక్ష విధించకూడదని, మరియు హద్దు శిక్షలు అగ్నితో అమలు చేయబడవని చెప్పబడింది.
  • ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క ఘనత, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ యొక్క హదీథుల పట్ల ఆయనకున్న విస్తారమైన జ్ఞానం మరియు ధర్మశాస్త్ర పాండిత్యం ఇందులో తెలుస్తున్నది.
  • విభేదించేవారిని ఖండించే శిష్టాచారం అని తెలుస్తున్నది.
explain-icon

కూర్పులు

explain-icon

ఇంకా