ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్, ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు’ను ప్రజలకు విద్యను బోధించడానికి మరియు వారిని ఇస్లాం వైపు ఆహ్వానించడానికి యమన్ వైపుకు పంపిస్తూ, ఆయన అతనికి ఇలా ఆదేశించినారు: ముస్లింల నుండి వారి ఆవుల జకాత్‌ను తీసుకోవాలి, ప్రతీ ముప్పై ఆవుల నుండి ఒక సంవత్సరం నిండిన మగ దూడ (తబీఅ) లేదా ఆడ దూడ (తబీఅ) తీసుకోవాలి, మరియు ప్రతీ నలబై ఆవుల నుండి రెండు సంవత్సరాలు నిండిన ఒక ఆడ దూడ (ముసిన్నహ్) తీసుకోవాలి. మరియు గ్రంథ ప్రజలైన యూదులు మరియు క్రైస్తవులలోని ప్రతీ యవ్వనుడైన పురుషుని నుండి ఒక దీనారు, లేదా ఒక దీనారుకు సమానమైన 'మఆఫిరి' అని పిలువబడే యెమెన్ వస్త్రాలను జిజియాగా తీసుకోవాలి.