అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ఒక ప్రయాణములో మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాము. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినారు. అప్పుడే మేము హమ్మారా అనే పక్షిని దాని రెండు పిల్లలతో చూసాము. మేము దాని పిల్లలను పట్టుకున్నాము. ఆ పక్షి వచ్చి దాని రెక్కలు ఆడించడం ప్రారంభించింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వచ్చి, అది చూసి: “ఈ పక్షి తన బిడ్డ కోసం దుఃఖపడేలా చేసింది ఎవరు? ఆమె బిడ్డను ఆమెకు తిరిగి ఇవ్వండి” అన్నారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మేము కాల్చివేసిన ఒక చీమల పుట్టను చూసి: “దీనిని ఎవరు కాల్చారు?” అని అడిగినారు. దానికి మేము: “మేము కాల్చినాము” అన్నాము. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “నరకాగ్ని యొక్క ప్రభువైన అల్లాహ్ తప్ప ఎవ్వరూ అగ్నితో శిక్షించకూడదు” అన్నారు. ప్రామాణికమైన హదీథు - అబూదావూద్ నమోదు చేసినారు:
explain-icon

వివరణ

ఈ హదీథులో అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఇలా ప్రస్తావిస్తున్నారు: ఒకసారి వారందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ప్రయాణిస్తున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళరు. అప్పుడే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు రెండు పిల్లలు కలిగి ఉన్న ఒక హుమ్మర్ పక్షిని చూసారు. వారు ఆ పక్షి రెండు పిల్లలను పట్టుకున్నారు, దాంతో ఆ పక్షి తన రెండు పిల్లలను కోల్పోయినందుకు భయంతో తన రెక్కలను అల్లాడిస్తూ తిరగడం ప్రారంభించింది. ఇంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అది చూసి ఇలా అన్నారు: "దాని పిల్లలను తీసుకుని దానికి బాధ కలిగించి, భయపెట్టింది ఎవరు?" తరువాత ఆ పక్షి పిల్లలను దాని వాటి తల్లికి తిరిగి ఇవ్వమని ఆజ్ఞాపించారు. ఆ తరువాత, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అగ్నితో కాలిపోయిన చీమల పుట్టను చూసి, ఆయన ఇలా అన్నారు: “దీనిని ఎవరు కాల్చారు?” కొంతమంది సహచరులు (సహాబాలు) “మేము” అని జవాబిచ్చినారు. వారితో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “ప్రాణాలతో జీవించి ఉన్న ఎవరినీ కూడా, అగ్నితో శిక్షించడానికి ఎవరికీ అనుమతి లేదు, దానిని సృష్టించిన అల్లాహ్’కు తప్ప.”

explain-icon

fawaed

  • కాలకృత్యాలు తీర్చుకొనునపుడు గోప్యత పాటించాలని సిఫార్సు చేయబడుచున్నది.
  • పశుపక్ష్యాదుల పిల్లలను పట్టి ఉంచుకుని వాటికి బాధ కలిగించడం నిషేధము.
  • నిప్పుతో (బ్రతికి ఉన్న) క్రిమికీటకాలను కాల్చి చంపడం నిషేధము.
  • జంతువుల పట్ల దయ మరియు కరుణను ప్రోత్సహించడం అనేది ఇస్లాంలో చాలా కాలంగా ఉన్న మార్గదర్శకం.
  • ఈ హదీథు ద్వారా జంతువుల పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కరుణ తెలుస్తున్నది.
  • అగ్నితో శిక్షించడం అనేది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకమైనది.