విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయషా రదియల్లాహు అన్హాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటిలో ఎలా ఉండేవారు అని, తన ప్రవర్తన గురించి, తాను చేసే పనుల గురించి అడిగారు. ఆమె ఇలా జవాబిచ్చినారు: "ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇతరుల వలే ఒక మానవమాత్రుడు మాత్రమే. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులు తమ ఇళ్లలో చేసే విధంగానే పని చేసేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన పనులను తానే చేసుకునేవారు మరియు తన కుటుంబానికి కూడా సేవ చేసేవారు (అంటే ఇంటి పనులలో సహాయం చేసేవారు); ఆయన తమ గొర్రెలకు పాలు పితుకుతారు, తన బట్టలు చిరిగిపోతే కుట్టుకుంటారు, తన చెప్పులు తెగిపోతే వాటిని కుట్టి సరిచేసుకుంటారు మరియు ఇంటిలో లోహపు బాల్చీ (బక్కెట్టు) పాడైపోతే దానికి అతుకులు వేసి బాగుచేస్తారు. అయితే నమాజు సమయం ఆసన్నమైనపుడు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆలస్యం చేయకుండా నమాజు కొరకు బయటకు వెళ్ళేవారు.