ఈ హదీథులో ఉమైమహ్ బింతె రుఖైఖహ్ (రదియల్లాహు అన్హా) ఇలా వివరించినారు: ఆమె కొందరు అన్సారు స్త్రీలతో కలిసి విధేయతా ప్రమాణం చేయడానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చినారు. తాము అల్లాహ్’కు ఎవరినీ సాటి కల్పించము అని, దొంగతనానికి పాల్బడము అని, వ్యభిచారానికి పాల్బడము అని, తమ చేతులకు, కాళ్ళకు మధ్య కల్పించిన ఏ అబధ్ధాన్ని పలుకము అని, అలాగే మరియు ఏ మంచి విషయం లోనూ తాము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిపై ప్రతిజ్ఞ చేయాలని. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “మీకు సాధ్యపడినంత వరకు మరియు మీరు భరించగలిగినంత వరకు” (ఆమె ఇలా అన్నారు) “దానికి మేము ఇలా అన్నాము: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మా పట్ల (స్త్రీల పట్ల) అత్యంత దయామయులు. రండి ఓ ప్రవక్తా! ఏవిధంగానైతే మగవారు మీ చేతిపై చేయి వేసి ప్రతిజ్ఞ చేసినారో అలా మిమ్మల్ని కూడా ప్రతిజ్ఞ చేయనివ్వండి.” అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “నేను స్త్రీలతో కరచాలనం చేయను. నామాటలు మరియు విధేయతా ప్రతిజ్ఞలు వందమంది స్త్రీలకు చేసినా ఒక స్త్రీకి చేసినా సమానమే.