ఒక ముస్లింకు వీలునామా రాసి ఇవ్వడానికి ఏవైనా హక్కులు లేదా ఆస్తులు ఉంటే, అది చిన్నదైనా సరే, తన వీలునామా రాసి సిద్ధంగా ఉంచుకోకుండా మూడు రాత్రులు గడపరాదని ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదిఅల్లాహు అన్హుమా ఇలా అన్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా చెప్పగా విన్నప్పటి నుండి, నా వీలునామా నా వద్ద సిద్ధంగా లేకుండా నేను ఒక్క రాత్రి కూడా గడపలేదు.