ఒక పల్లెటూరి వ్యక్తి జుమా రోజున, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఇంటి వైపు ఉన్న మస్జిద్ పశ్చిమ ద్వారం నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లోకి ప్రవేశించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బహ్ ఇస్తున్నారు (ప్రసంగిస్తున్నారు). ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపు తిరిగి ఇలా అన్నాడు: "ఓ రసూలుల్లాహ్ ప్రవక్తా! పశువులు (ఆకలితో) నశించిపోయాయి, ప్రజలను రవాణా చేసే జంతువులు చనిపోవడం లేదా ఆకలితో బలహీనపడటం వల్ల మార్గాలు మూసుకుపోయాయి, కావున మాపై వర్షం కురిపించమని అల్లాహ్ ను ప్రార్థించండి". అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను పైకి ఎత్తి, ఇలా ప్రార్థించారు: "ఓ అల్లాహ్! మాపై వర్షాన్ని కురిపించు, ఓ అల్లాహ్! మాపై వర్షాన్ని కురిపించు, ఓ అల్లాహ్! మాపై వర్షాన్ని కురిపించు." అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఇంకా ఇలా తెలిపినారు: అల్లాహ్ సాక్షి! అపుడు ఆకాశంలో ఒక్క మేఘం ముక్క కూడా లేదు, మరియు మస్జిద్ లో ఉన్న మాకు మరియు మస్జిద్ కు పశ్చిమాన ఉన్న సలయి కొండకు మధ్య, ఏ వైపు నుండి మేఘాలు వస్తాయో ఆ వైపున, మా దృష్టికి అడ్డువచ్చే ఏ ఇళ్ళు గానీ, కట్టడాలస గానీ లేవు. అనస్ రదియల్లాహు అన్హు తెలిపారు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వెనక నుండి ఒక డాలు వంటి గుండ్రని మేఘం పైకి వచ్చింది, అది మదీనా ఆకాశం మధ్యలోకి రాగానే వ్యాపించి, వర్షం కురిపించడం మొదలుపెట్టింది. అల్లాహ్ సాక్షి! మేము తరువాతి జుమా వరకు వర్షం కారణంగా సూర్యుడిని చూడలేదు, అప్పుడు ఒక వ్యక్తి అదే ద్వారం గుండా ప్రవేశించాడు. అపుడు కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బహ్ ఇస్తున్నారు. అతను నిలబడి ఆయన వైపు తిరిగి, ఇలా అన్నాడు: ఓ రసూలుల్లాహ్! (భారీ వర్షం, వరదల వలన) సంపద నాశనమైంది, మార్గాలు మూసుకుపోయాయి, మాపై నుండి ఈ వర్షాన్ని ఆపమని అల్లాహ్ తో దుఆ చేయండి. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులు పైకెత్తి, ఇలా ప్రార్ధించారు: ఓ అల్లాహ్! మాపై కాకుండా మా చుట్టు ప్రక్కల వర్షాన్ని కురిపించు. ఓ అల్లాహ్! కొండలు, గుట్టలు, లోయలు మరియు చెట్లు మొలిచే చోట్లలో వర్షాన్ని కురిపించు. అనస్ ఇలా అన్నారు: అపుడు మబ్బులు విడిపోయాయింది, మేము ఎండలో నడుచుకుంటూ బయటకు వచ్చాము.