ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఒక ముస్లిం, ఒకవేళ తన మసులో చెడు ఆలోచనలు ఉన్నట్లైతే, అతడు వాటిపై అమలు చేయనంత వరకు లేదా వాటి గురించి బయటకు మాట్లాడనంత వరకు – అతడు అటువంటి చెడు ఆలోచనలు కలిగి ఉన్నందుకు బాధ్యుడుగా చేయబడడు, అల్లాహ్ అతని పై నుంచి ఆ భారాన్ని తొలిగించి అతణ్ణి క్షమించాడు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాజాన్ని (ఉమ్మత్’ను) వారి హృదయాలలో ఉన్న దానికి (అది చెడు ఆలోచన అయినా) అల్లాహ్ వారిని బాధ్యులను చేయలేదు; వారి హృదయాలలో ఉన్నది వారి ఆత్మలలో పునరావృతం అవుతూ ఉన్నా, అది అక్కడ స్థిరపడకుండా ఉన్నట్లైతే. ఒకవేళ అది అతని హృదయంలో స్థిరపడిపోయినట్లైతే, ఉదాహరణకు: గర్వము, అహంభావము, మోసము; కపటత్వము మొదలైనవి అక్కడ స్థిరపడిపోతే అప్పుడు అతడు బాధ్యునిగా నిలబెట్టబడతాడు; లేక అతడు తన అవయవాలతో ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టినా; లేక అతడు తన నాలుకతో వాటిని ఉచ్ఛరించినా – అపుడు అతడు బాధ్యునిగా నిలబెట్టబడతాడు.