ఈ హదీసులో – లంచము ఇచ్చే వాడు, మరియు లంచము పుచ్చుకునే వాడు – ఇద్దరూ - సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ యొక్క కరుణనుండి, దూరమగు గాక అని శపించినారు. ఇందులో న్యాయమూర్తులకు ఇచ్చే లంచము కూడా ఉన్నది. తనకు హక్కు లేని విషయములో తన పక్షమున తీర్పు ఇచ్చేలా చేయుటకు అతడు లంచము ఇస్తాడు.