ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిశుద్ధత అనేది సలాహ్ ఆచరించుట కొరకు ఒక షరతు అని తెలుపుతున్నారు. కనుక ఎవరైతే సలాహ్ ఆచరించాలని సంకల్పిస్తాడో, అతడు అంతకు ముందు వుదూను భంగ పరిచే పనులలో దేనికైనా పాల్బడి ఉంటే, అతడు సలాహ్ ఆచరించడానికి వుదూ చేయుట అతని కొరకు విధి అవుతుంది.