ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "శుక్రవారనాడు ‘ఖుత్బతుల్ జుమ్’అహ్’ (జుమా ప్రసంగము) వినుట కొరకు హాజరైన వారు విధిగా ఆచరించవలసిన మర్యాద ఏమిటంటే వారు జుమా ప్రసంగాన్ని శ్రద్ధగా వినడం" అని వివరిస్తున్నారు. అంటే ఇమాం ప్రసంగాన్ని శ్రద్ధగా వినడం, అందులో చేయబడే సూచనలపై, హెచ్చరికలపై లోతుగా ఆలోచించడం, అవగాహన చేసుకోవడం, అలాగే ఇమాం ప్రసంగిస్తూ ఉండగా ఒక చిన్న మాటైనా సరే మాట్లాడకుండా ఉండటం ఉత్తమం. మీ ప్రక్కవాడిని “మౌనంగా ఉండు” అని, లేక “విను” అని అన్నా కూడా అతడు జుమా నమాజు యొక్క ఘనతను కోల్పోయిన వాడవుతాడు.