ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసిని మంచి పనులను చేయడం వేగవంతం చేయమని మరియు మంచి పనులు చేయడం అసాధ్యమయ్యే పరిస్థితులు రాకముందే వాటిని వీలైనంత ఎక్కువగా చేయమని ప్రోత్సహిస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే పరీక్షలు అతనిలో సందేహాలను రేకెత్తిస్తాయి, వాటి నుండి అతడి ధ్యానాన్ని మళ్ళిస్తాయి. అతని స్థితి ఎలా ఉంటుందంటే దట్టమైన చీకటి లాగా ఉంటుంది. అటువంటి స్థితిలో సత్యమూ, అసత్యమూ కలగాపులగం అయిపోయి, ప్రజలకు వాటి మధ్య భేదాన్ని కనుగొనుట కష్టమైపోతుంది. అటువంటి పరిస్థితుల తీవ్రత కారణంగా వ్యక్తి పూర్తిగా అయోమయ పరిస్థితిలో పడిపోయి ఈ లోకంలోని తాత్కాలిక ఆనందాల కోసం తన ధర్మాన్ని వదిలి వేసి, ఉదయం విశ్వాసిగా ఉన్న అతడు, సాయంత్రం అవిశ్వాసిగా మారిపోతాడు, మరియు సాయంత్రం విశ్వాసిగా ఉన్న అతడు ఉదయానికి అవిశ్వాసిగా మారిపోతాడు.