ప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు: మహోన్నతుడైన అల్లాహ్ ఖుద్సీ హదీథ్‌లో ఇలా అంటున్నాడు — "కష్టాలు, అపాయాలు వచ్చినప్పుడు — మనిషి కాలాన్ని తిడుతూ నన్ను బాధపెడుతున్నాడు, నా సార్వభౌమత్వాన్ని కించపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ప్రతిదాన్నీ నడిపించే అధికారం కేవలం నా వద్ద మాత్రమే ఉంది. ఏమి జరిగినా, అదంతా నా ఆజ్ఞతోనే జరుగుతున్నది. కాబట్టి కాలాన్ని తిడటమంటే, నిజానికి నన్నే తిడటమే."