ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆశ్చర్యంతో ఇలా వివరించారు: తాను తీసుకొచ్చిన మార్గదర్శకం మరియు కోరిన లక్ష్యానికి చేర్చే మార్గం, మరియు షరియా జ్ఞానం నుండి ప్రయోజనం పొందే వ్యక్తిని, ఎక్కువ వర్షం పడే భూమితో పోల్చారు; అది మూడు రకాలుగా విభజించబడింది: మొదటిది: వర్షపు నీటిని స్వీకరించే స్వచ్ఛమైన, సారవంతమైన భూమి, తరిభూమి మరియు పొడిభూమి (మెరక) రెండింటిలోనూ సమృద్ధిగా మొక్కలను ఉత్పత్తి చేస్తుంది, ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. రెండవది: నీటిని నిలుపుకునే భూమి కానీ ఇందులో పంటలు పండవు, వృక్షసంపద పెరగదు. ప్రజలు ప్రయోజనం పొందేందుకు ఇది నీటిని నిలుపుకుంటుంది, ప్రజలు ప్రయోజనం పొందేందుకు వీలు కల్పిస్తుంది. కాబట్టి వారు తమ పశువులకు నీరు త్రాపుతారు మరియు పంటలకు నీరు పెడతారు. మరియు మూడవ రకం: ఇది నున్నగా, చదునుగా ఉండే నేల. ఇది నీటిని నిలుపుకోదు లేదా ఎటువంటి వృక్షసంపదను పెంచదు. ఇది వర్షపు నీటితో తనకు తానుగా ప్రయోజనం పొందదు, లేదా ఇతరులకు కూడా ప్రయోజనం కలిగించదు. ప్రజల కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఏ జ్ఞానము మరియు మార్గదర్శకత్వముతో పంపబడినారో దానిని వినే వారికి కూడా ఇది వర్తిస్తుంది. మొదటి రకం: ధర్మపండితుడు: ఇతడు అల్లాహ్ యొక్క ధర్మాన్ని అర్థం చేసుకుని, తాను ఆర్జించిన జ్ఞానం ప్రకారం నడుచుకుని, ఇతరులకు ఆ ఙ్ఞానాన్ని బోధిస్తాడు. అతను నీటిని పీల్చుకుని, తనకు తానుగా ప్రయోజనం చేకూర్చుకుని, తోటల పెరుగుదలకు కారణమై, తద్వారా ఇతరులకు ప్రయోజనం చేకూర్చే సారవంతమైన భూమి లాంటివాడు. రెండవ రకం: ఇతడు జ్ఞానాన్ని కంఠస్థం చేసుకుని, భద్రపరిచేవాడు. కానీ ఆ ఙ్ఞానం పట్ల లోతైన అవగాహన లేదా తద్వారా ధార్మిక నియమాలను రూపొందించే సామర్థ్యం లేనివాడు. అతను జ్ఞానాన్ని సేకరిస్తాడు, దాని కోసం తన సమయాన్ని వెచ్చిస్తాడు, కానీ ధర్మం అతడిని ఆచరించమని బోధించే స్వచ్చంద సత్కార్యాలను ఆచరించడు లేదా అతను సేకరించిన ఙ్ఞానాన్ని అర్థం చేసుకోడు. అతను ఇతరులకు ప్రయోజనం చేకూర్చే సాధనం లాంటివాడు - వారికి ప్రయోజనం చేకూర్చేవాడు. నీటిని నిల్వ ఉంచుకుని ప్రజలకు ప్రయోజనం చేకూర్చే భూమి లాంటి వాడు. మూడవ రకం: జ్ఞానాన్ని విని దానిని నిలిపి ఉంచుకోని వాడు, దాని ప్రకారం ప్రవర్తించని వాడు, ఆచరించని వాడు, దానిని ఇతరులకు అందించని వాడు. అతను వృక్షసంపద పెరగని, నీటిని పీల్చుకోని లేదా ఇతరులు దాని నుండి ప్రయోజనం పొందనివ్వని బంజరు లేదా చదునైన, నున్నని మైదాన భూమి లాంటివాడు.