ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని (దుఆ చేసినారని) అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు: “ఓ అల్లాహ్, పరలోక జీవితం తప్ప నిజమైన జీవితం మరొకటి లేదు, కనుక (ఓ అల్లాహ్!) అన్సార్లను (సహాయకులు) మరియు ముహాజిరులను (వలస వచ్చినవారిని) క్షమించు”. ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
explain-icon

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: పరలోక జీవితం తప్ప నిజమైన జీవితం మరొకటి లేదు, అల్లాహ్ యొక్క ప్రసన్నత, కరుణ మరియు స్వర్గం తప్ప మరొకటి లేదు, ఎందుకంటే ఇహలోక జీవితం క్షణికమైనది, మరి పరలోక జీవితం నిత్యమైనది మరియు శాశ్వతమైనది. ఆ తరువాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మరియు ముహాజిర్లకు ఆశ్రయం ఇచ్చిన అన్సార్ల కోసం వారి క్షమాపణ, గౌరవం మరియు ధర్మం కోసం దుఆ చేసారు. మక్కా నుండి మదీనాకు వలస వచ్చిన ముహాజిర్లకు అన్సారులు మద్దతుగా నిలిచారు, తమ సంపదను వారితో పంచుకున్నారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తమ ఇళ్ళను, తమ సంపదలను వదిలి కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు మరియు ఆయన ప్రసాదించే ప్రతిఫలం కొరకు వలస వచ్చిన ముహాజిర్ల కొరకు కూడా దుఆ చేసినారు.

explain-icon

Benefits from the Hadith

  • ఇందులో ఈ లోకం పట్ల ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వైరాగ్యము, మరియు పరలోకం పైననే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దృష్టిని కేంద్రీకరించడం మనం చూడవచ్చు.
  • ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్’ను ఈ ప్రాపంచిక జీవితంలోని నశించిపోయే సుఖాలను త్యజించమని ప్రోత్సహించారు.
  • అలాగే ఇందులో ముహాజిర్ల మరియు అన్సార్ల యొక్క సద్గుణాలను ప్రస్ఫుటం చేస్తూ ప్రకటన ఉన్నది. ఎందుకంటే వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘మగ్’ఫిరహ్’ (క్షమాపణ) కొరకు చేసిన దుఆను సాధించారు.
  • ఒక దాసుడు ఈ లోకంలో తాను సాధించే దానితో సంతోష పడి పోరాదు, ఎందుకంటే అది క్షణికమైనది మరియు కష్టాలతో నిండి ఉంటుంది. స్థిరత్వం మరియు శాశ్వతత్వానికి నిలయం పరలోకం.