ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక వ్యక్తి ఇలా అడిగాడు: మేము సముద్రంపై నావలలో, పడవలలో వ్యాపారం నిమిత్తం, చేపలు పట్టే నిమిత్తం ప్రయాణిస్తూ ఉంటాము. మేము మా వెంట త్రాగడానికి కొద్దిపాటి మంచి నీళ్ళు తీసుకువెళతాము. మేము ఈ మంచి నీళ్ళను ఉదూ చేయడానికి, లేదా గుసుల్ చేయడానికి ఉపయోగించినట్లయితే మా వద్ద త్రాగడానికి మంచినీళ్ళ కొరత ఏర్పడుతుంది; ఇంక మాకు ఏమీ లభించదు. సముద్రపు నీటితో ఉదూ, గుసుల్ చేయుటకు మాకు అనుమతి ఉన్నదా?” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సముద్రపు నీటిని గురించి ఇలా అన్నారు: “దాని నీరు పరిశుద్ధమైనది మరియు పరిశుద్ధ పరుచునటువంటిది. దానితో ఉదూ మరియు గుసుల్ చేయుట అనుమతించబడినది; మరియు సముద్రం నుండి బయటకు తీసుకురాబడే (సముద్రంలో లభించే) దేనినైనా, ఉదాహరణకు చేపలు, వేల్ చేప వంటి జంతువులు మొదలైనవి, వాటిని పట్టుకొనడానికి ముందే అవి చనిపోయి సముద్రపు నీటిపై తేలియాడుతూ ఉన్నప్పటికీ, వాటిని తినుటకు అనుమతి ఉన్నది (హలాల్).