అలీ బిన్ అబూ తాలిబ్ రదియల్లాహు అన్హు యెమెన్ నుండి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఒక బంగారం ముక్కను పంపించారు. ఆ బంగారం ముక్కను చర్మంతో తయారుచేసిన సంచిలో పెట్టి పంపించారు. ఆ బంగారం ముక్కను ఇంకా మట్టి అంటుకునే ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (ఆ బంగారాన్ని) అక్కడున్న నలుగురు వ్యక్తులకు పంచిపెట్టారు. ఆ నలుగురు - ఉయైనహ్ బిన్ బద్ర్ అల్ ఫజారీ, అఖ్రఅ్ బిన్ హాబిస్ అల్ హన్జలీ, జైద్ అల్ ఖైల్ అల్ నబ్హానీ, మరియు అల్కమా బిన్ ఉలాథా అల్ ఆమిరీ. అది చూసి ఆయన సహాబాలలోని ఒకరు ఇలా అన్నారు: "వీళ్ళకంటే మేమే దీనికి ఎక్కువ హక్కుదారులం."హదీసు రావీ అంటున్నారు: ఆ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సల్లల్లాహు అలైహి వసల్లంకు చేరితే ఆయన ఇలా పలికినారు: "నీవు నన్ను నమ్మడం లేదా? నేను ఆకాశంలో ఉన్నవాని (అల్లాహ్) విశ్వసనీయుడిని. నాకు పరలోక సమాచారం ఉదయం, సాయంత్రం వస్తూ ఉంటుంది." అప్పుడు ఆ వ్యక్తి లేచాడు — అతడి కళ్లు లోతుగా, బుగ్గలు బయటకు ఉబ్బి, నుదురు కొంచెం పైకి ఉండి, గడ్డం మందంగా (కానీ పొడవుగా కాదు) ఉంది, తలను పూర్తిగా గొరిగించుకుని ఉన్నాడు, తన కింద భాగాన్ని కప్పే వస్త్రాన్ని పైకి ఎత్తుకుని ఉన్నాడు — అతను ఇలా అన్నాడు: "ఓ రసూలుల్లాహ్! అల్లాహ్ కు భయపడండి." దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: "నీకు శాపం! భూమిపై ఉన్న వారందరిలో అల్లాహ్ కు భయపడటానికి నేను ఎక్కువ అర్హుడిని కాదా?" ఆ తరువాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అప్పుడు ఖాలిద్ ఇబ్న్ వలీద్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు:" "ఓ రసూలుల్లాహ్! నేను అతడి మెడ నరికి వేయనా?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: 'లేదు, అతను నమాజ్ చేసే వాడై ఉండవచ్చు' అని పలికినారు. అప్పుడు ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు, "ఎంతో మంది నమాజ్ చేసేవారిలో వారి నోటితో చెప్పేది వారి హృదయంలో ఉండదు" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ప్రజల హృదయాలను తవ్వి చూడమని, లేదా వారి పొట్టలను చీల్చి చూడమని నేను ఆదేశించబడలేదు; బహిరంగ విషయాల ప్రకారం మాత్రమే తీర్పు చెప్పమని నేను ఆదేశించబడినాను." "ఆ వ్యక్తి వెనక్కు తిరిగి వెళ్తుండగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని చూసి ఇలా పలికినారు: "ఈ వ్యక్తి సంతానంలో నుండో లేదా అతని సహచరుల సంతానంలో నుండో లేదా అతని తెగ సంతానంలో నుండో ఒక వర్గం పుట్టి, బయలుదేరుతుంది. ఆ వర్గం వారు అల్లాహ్ యొక్క గ్రంథాన్ని (ఖుర్ఆన్‌ను) చాలా చక్కటి స్వరంతో మృదుమధురంగా పఠించడంలో నిపుణులు. వారి నోళ్లు ఖుర్ఆన్ పారాయణం వల్ల తడిగా ఉంటాయి. కానీ ఖుర్ఆన్ వారి గొంతును దాటి వారి హృదయాలకు చేరదు, అంటే వారు పఠించిన ఖుర్ఆన్ వారి మనసులను మార్చదు, అల్లాహ్ వారిని (శుభాలలో) పైకి ఎత్తడు, వారిని అంగీకరించడు. బాణం ఎక్కు పెట్టిన తరువాత అది తన లక్ష్యాన్ని ఛేదించడానికి వెంటనే ఎంత వేగంగా బయటకు వెళ్తుందో, వారు అంత వేగంగా, సులభంగా ఇస్లాం నుండి బయటకు వెళ్లిపోతారు." ఆ తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా కూడా అన్నారని నేను అనుకుంటున్నాను: 'వారు (ఆ వర్గం) ముస్లింలపై ఖడ్గంతో (యుద్ధంతో) తిరుగుబాటు చేసినపుడు, థమూద్ ప్రజలను ఎలా నాశనం చేయబడినారో, వారు కూడా అలా తీవ్రంగా సంహరింప బడాలని నేను ఆశిస్తున్నాను.'"