ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఎవరైతే నక్షత్రాల గమనాలను, గ్రహాల గమనాలను అధ్యయనం చేయడం ద్వారా, అవి (భూకక్ష్య లోనికి) ప్రవేశించడం లేదా (దూరంగా) వెళ్ళిపోవడం మొదలైన వాటి ద్వారా – భూమిపై జరిగే ఘటనలను, ఉదాహరణకు ఎవరి మృత్యువునకు లేక ఎవరి జన్మకు లేక ఎవరైనా వ్యాధిగ్రస్తులు కావడానికి, లేక అలాంటి విషయాలకు లేక భవిష్యత్తులో జరుగబోయే అలాంటి విషయాలకు ముడిపెట్టి వాటికి ఋజువులుగా చూపుతాడో – అతడు నిశ్చయంగా చేతబడి (మంత్రతంత్ర) విద్యలో ఒక భాగాన్ని నేర్చుకున్నట్లే. అతడు ఎంత ఎక్కువగా అందులో నిమగ్నమైపోతే అంత ఎక్కువగా ఆ విద్యను నేర్చుకున్నట్లే.