ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపినారు: "ఎవరైతే [నేను అల్లాహ్‌ను - నా ప్రభువుగా, ఆరాధ్యుడిగా, పోషకుడిగా, సర్వాధికారిగా, యజమానిగా, నన్ను సరిదిద్దేవాడిగా మనస్పూర్తిగా (రజా) అంగీకరిస్తున్నాను; ఇస్లాం ధర్మాన్ని — దాని అన్ని ఆజ్ఞలు, నిషేధాలతో సహా — నా ధర్మంగా, నా మార్గంగా, నా విశ్వాసంగా, సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను; అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ప్రవక్తగా, సందేశహరుడిగా, ఆయన తెచ్చిన ప్రతీ విషయాన్ని, ప్రకటించిన ప్రతీ సందేశాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను'] అని హృదయపూర్వకంగా ఒప్పుకుంటారో, అతనికి తప్పకుండా స్వర్గం లభిస్తుంది."